పిల్లి బొమ్మతో దోశె.. వైవిధ్యంగా బిజినెస్

పిల్లి బొమ్మతో దోశె.. వైవిధ్యంగా బిజినెస్

దోశె.. దోశె అంటే కామన్.. అందరూ దోశ వేస్తారు.. ఏ హోటల్‭కు వెళ్లినా అదే దోశ.. కాకపోతే మసాలా దోశ.. ఉల్లి దోశ.. కారం దోశ.. అయితే దోశలో టెస్టులు వేరుకావచ్చు.. కాని ఆకారం మాత్రం ఒకేలా ఉంటుంది. దోశ అంటే గుండ్రపు ఆకారంలో ఉంటుంది అని మాత్రమే అందరికి తెలుసు. చాలా మంది ఆహార ప్రియులు తాము రోజు వారి తినే ఆహారాన్ని ఒక్కోసారి డిఫరెంట్ గా ట్రై చేయడానికి చాలా ఇష్టపడతారు. తాజాగా ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి దోశ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ తన ట్విట్టర్ షేర్ చేశారు. 

ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి దోసె పిండిని తవాపై వృత్తాకార పద్ధతిలో వేసి.. జంతువు బొమ్మను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని సెకన్ల తర్వాత మరింత పిండిని తీసుకుని.. మరొక వృత్తాన్ని తయారు చేస్తాడు. చివరికి అతను పిండిని తవాపై తిప్పుతుండటం చూస్తే పిల్లి బొమ్మను గీసినట్లు కనిపిస్తుంది. పిల్లి కళ్లు, ముక్కు, నోరు షేపులు వచ్చేలా చేసిన తర్వాత అదనంగా ఉన్న పిండిని తీసివేస్తాడు. తర్వాత దోసెను మడిచి కొబ్బరి చట్నీతో వడ్డిస్తాడు. రెండు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజెన్లు వావ్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది దీని రుచి ఎంత బాగుంటుందో.. ఎక్కడో చెప్తే మేము దొశ టేస్ట్ ట్రై చేస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి టాలెంట్ ని మెచ్చుకుంటున్నారు.