క్రియేటివ్ ట్రిక్‌తో పరీక్షల్లో కాపీ కొట్టిన స్టూడెంట్

 క్రియేటివ్ ట్రిక్‌తో పరీక్షల్లో కాపీ కొట్టిన స్టూడెంట్

మోసం చేయడం కూడా ఓ కళ అని ఈ వీడియోను చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మోసం చేసే టాలెంట్ అందరికీ ఉండదు. ఒకవేళ అలవాటి, నేర్పు లేకపోతే ఈజీగా బయట పడిపోతారు. అయితే పరీక్షల్లో అందర్నీ మోసం చేసేందుకు ఓ స్టూడెంట్ ఓ క్రియేటివ్ టెక్నిక్ ను ఉపయోగించాడు. పెన్నుల పౌచ్ లో పెన్నులు, పెన్సిళ్లు ఉన్నట్టుగా అందర్నీ నమ్మించి, ఎగ్జామ్ లో కాపీ కొట్టాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. స్టూడెంట్ పెన్నుల పౌచును ఓపెన్ చేసి ఉంచాడు. మామూలుగా చూసిన వాళ్లకు అందులో కలర్ కలర్ పెన్నులు లాంటి ఎగ్జామ్ లో వాడే వస్తువులు ఉన్నాయి. కానీ చివరి దాకా చూస్తూనే తెలుస్తుంది.. అవి పెన్నులు కాదు.. మొబైల్ ఫోన్ లోని గ్యాలరీలో ఉన్న ఒక ఫొటో అని.

ఈ ఫొటోని మినిమైజ్ చేసి, పక్కనే ఉన్న ఆన్సర్స్ ను విద్యార్థి కాపీ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను లాన్స్ అనే అడ్మిన్ ట్విట్టర్ లో షేర్ చేయగా ఇప్పటివరకు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దాంతో పాటు లక్షకు పైగా లైకులు వచ్చాయి. అయితే దీనికి దిస్ ఈజ్ ఎక్స్ పర్ట్ లెవల్ చీటింగ్ అనే క్యాప్షన్ జతచేశారు. వైరల్ గా అయిన ఈ వీడియోకు అదే స్థాయిలో కామెంట్లు కూడా వస్తున్నాయి. స్మార్ట్ ట్రిక్, మోసం చేయడం కష్టమైన పని, మేధావి అనే కామెంట్లతో నెటిజన్లు ఈ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు.