
తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధాలో మహాధర్నా నిర్వహించారు. వేతన సవరణ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ఛలో విద్యుత్ సౌధ పిలుపు మేరకు ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధకు పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలివచ్చారు.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరకంగా నినాదాలు చేశారు.
విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో విద్యుత్ సౌధా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్ -పంజాగుట్ట రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ ఉద్యోగులను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.