చండీగఢ్:పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై విజిలెన్స్ బ్యూరో లుకౌట్ సర్క్యూలర్(ఎల్‌ఓసీ) జారీ చేసింది. ముక్త్ సర్‌లోని ఆయన నివాసంపై విజిలెన్స్ బృందాలు సోమవారం సోదాలు నిర్వహించాయి.
భటిండాలో ఆస్తి కొనుగోలులో అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సరూప్ చంద్ సింగ్లా 2021లో చేసిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ బ్యూరో విచారణ మొదలు పెట్టింది. బాదల్‌తో పాటు, మరో అయిదుగురిపై కేసు నమోదైంది.భటిండాలో 1,560 చదరపు గజాల విస్తీర్ణం కల ప్లాట్ల కొనుగోలులో బాదల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డార ని అధికారులు ఆరోపించారు.