కరూర్ తొక్కిసలాట.. ప్రత్యర్థుల ‘ఉమ్మడి కుట్ర’: విజయ్

కరూర్ తొక్కిసలాట.. ప్రత్యర్థుల ‘ఉమ్మడి కుట్ర’: విజయ్

తిరుచిరాపల్లి: తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ తనపై జరుగుతున్న రాజకీయ దాడులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రత్యర్థులపై సంచలన ఆరోపణలు చేశారు. 

గతేడాది కరూర్​తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విజయ్ స్పందిస్తూ.. ‘అది కేవలం ప్రమాదం కాదు, నా రాజకీయ ఎదుగుదలను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు పన్నిన ఉమ్మడి కుట్ర’ అని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.