
వర్సటైల్ యాక్టర్ విజయ్ ఆంటోనీ అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు తెరకెక్కించిన ఈమూవీని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 19న తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 10న) ‘భద్రకాళి’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ఉత్కంఠ కలిగించే అంశాలతో ఆసక్తి కలిగిస్తుంది. ‘‘జీవితం అనేది తన కోసం జీవించడం కాదు. మిగతా వాళ్ల కోసం జీవించడం. ఇక్కడ పార్టీ నడిపే వాళ్లందరికీ ఎన్నికలే అక్షయ పాత్ర. ఓటు కోసం వంగి దండాలు పెట్టేవాళ్లు, దోచుకోవడానికి జెండా లెత్తేవాళ్లు అందరూ పాలించడమే లక్ష్యం అంటున్నారు’’ అనే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది.
ఈ క్రమంలో ట్రైలర్ని బట్టి కొన్ని కొట్ల కుంభకోణం చుట్టూ కథ తిరిగేలా కనిపిస్తుంది. ఇందులో భాగంగా పొలిటికల్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ అంశాల మేళవింపుతో బలమైన కథను చెప్పబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది.
►ALSO READ | Prabhas: ‘ది రాజా సాబ్’ క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ & ట్రైలర్ రిలీజ్ డేట్స్ ఇవే
విజయ్ ఆంటోనీ కెరియర్లో ‘భద్రకాళి’ 25వ మూవీగా వస్తుంది. అందుకు తగ్గ ఇంపాక్ట్ కంటెంట్ తోనే విజయ్ వస్తుండటం విశేషత సంతరించుకుంది. ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ట్రైలర్కు ఇచ్చిన బీజీఎమ్ హైలైట్‌గా నిలుస్తోంది. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఈ మూవీలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.