
తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ(Vijay antony) ఇంట పెను విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన కూతురు మీరా ఆంటోని(16) (Meera Antony) మంగళవారం ఉదయం చెన్నైలోని (Chennai) డీడీకే రోడ్‌లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ప్రైవేటు కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న మీరా.. చదువుల్లో ఒత్తిడి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. కూతురు ఆకస్మిక మరణంతో.. విజయ్ ఆంటోనీ కుటుంబం శోకసంద్రంలోకి వెళ్ళింది.
- ALSO READ | బిచ్చగాడు హీరో కుమార్తె ఆత్మహత్య
అయితే కొద్దిసేపటి క్రితమే మీరా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు డాక్టర్లు. ఈ రిపోర్ట్ లో మీరాది ఆత్మహత్యే అని, ఆమె మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని ప్రకటించారు వైద్యులు. ఇక మీరా మృతదేహానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.