బిచ్చగాడుగా మహేష్ బాబు.. క్రేజీ కామెంట్స్ చేసిన విజయ్

బిచ్చగాడుగా మహేష్ బాబు.. క్రేజీ కామెంట్స్ చేసిన విజయ్

తెలుగులో చిన్న సినిమాగా విడుదలైన బిచ్చగాడు మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016 లో రిలీజైన ఈ సినిమాకు దాదాపు ఐదు సంవత్సరాల తరువాత సీక్వెల్ తెరకెక్కుతోంది. మొదటి పార్టులో హీరోగా చేసిన విజయ్ అంటోనీనే ఈ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మొదటి పార్టుకు వచ్చిన ఆధరణ దృష్టిలో ఉంచుకొని సీక్వెల్ ను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించారు మేకర్స్.

ఈ సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్లు, వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా తెలుగులో కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు బిచ్చగాడు మేకర్స్. ఇందులూ భాగంగా ఒక రిపోర్టర్.. బిచ్చగాడు క్యారెక్టర్ మీకు కాకుండా ఇంకెవరు చేస్తే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు అని హీరో విజయ్ ఆంటోనీని అడిగాడు. దానికి విజయ్.. కాసేపు ఆలోచింది మహేష్ బాబు అని చెప్పారు. తెలుగులో  ఈ సినిమా మహేష్ బాబుకు ఐతే చాలా బాగా సెట్ అవుతుందని, అయన అన్నిరకాల పాత్రలు చేయగలని చెప్పుకొచ్చాడు విజయ్.

ప్రస్తుతం విజయ్ ఆంటోనీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మే 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు బాగానే ఉన్నాయి. మరి బిచ్చగాడు లాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.