Maargan: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌‌గా మార్గన్.. వణికించే ట్విస్టులతో విజయ్ ఆంటోని ట్రైలర్‌

Maargan: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌‌గా మార్గన్.. వణికించే ట్విస్టులతో విజయ్ ఆంటోని ట్రైలర్‌

విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మార్గన్’.లియో జాన్ పాల్ దర్శకుడు. తెలుగులో జె.రామాంజనేయులు విడుదల చేస్తున్నారు. జూన్ 27న సినిమా విడుదల కానుంది. బుధవారం (MAY28) తెలుగు ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌మీట్‌‌లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఇస్తుంది. లియోని స్టోరీ చెప్పిన స్టైల్ నచ్చింది.  ఓ ఎడిటర్‌‌‌‌గా తను ఐదేళ్లుగా నాకు పరిచయం. అలాగే నా మేనల్లుడు అజయ్ ధీషన్‌‌ను ఈ చిత్రంతో విలన్‌‌గా లాంచ్ చేస్తున్నా.

‘బిచ్చగాడు 2’కి అతను అసిస్టెండ్ డైరెక్టర్‌‌‌‌గా వర్క్ చేశాడు.  బ్రిగిడా చాలా బాగా నటించింది. దీప్శిఖ రోల్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు.  లియో జాన్ పాల్ మాట్లాడుతూ ‘విజయ్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. అండర్ వాటర్ సీక్వెన్స్‌‌ కోసం అజయ్ చాలా కష్టపడ్డాడు. దీప్శిఖ, బ్రిగిడ చక్కగా నటించారు.  భాష్య శ్రీ తెలుగులో చక్కని డైలాగ్స్, పాటలు ఇచ్చారు’అని చెప్పాడు.

రామాంజనేయులు మాట్లాడుతూ ‘మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా ఉన్నప్పటి నుంచి విజయ్ ఆంటోని నాకు పరిచయం. తన మొదటి సినిమా ‘నకిలీ’ని తెలుగులో రిలీజ్ చేశాం. మళ్లీ ఇప్పుడు ‘మార్గన్‌‌’ను రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు.   అజయ్ ధీషన్, దీప్శిఖ ,  బ్రిగిడా, రచయిత భాష్యశ్రీ పాల్గొన్నారు.