కూతురు ఆత్మహత్యపై.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ పోస్ట్

కూతురు ఆత్మహత్యపై.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ పోస్ట్

తమిళ నటుడు, సంగీత దర్శకుడు  విజయ్ ఆంటోనీ(Vijay antony) ఇంట పెను విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన పెద్ద కూతురు మీరా ఆంటోని(16) (Meera Antony)  మంగళవారం ఉదయం చెన్నైలోని (Chennai) డీడీకే రోడ్‌లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

లేటెస్ట్ గా తన కూతురు మీరా ఆత్మహత్యపై విజయ్ ఆంటోనీ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు.. నా కూతురు చాలా ప్రేమగా, ధైర్యంగా ఉండేది. ఇప్పుడు కల,. మతం, డబ్బు, అసూయా, భాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశానికి వెళుతుంది. మీరా నాతో మాట్లాడుతుంది. తనతో పాటు నేను చనిపోయాను. ఆమెతో సమయం గడపడం స్టార్ట్ చేసాను. ఇక నుంచి నేను చేయబోయే మంచి పనులన్నీ తన పేరు మీదనే చేస్తాను అంటూ..ఎమోషనల్ ట్వీట్ చేశారు. 

ఇక మీరా గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, చికిత్స కూడా పొందుతున్నట్లు రీసెంట్గా  పోస్ట్ చేసింది. విజయ్ ఆంటోనీ కూతురు ఆకస్మిక మరణంతో కుటుంబం అంతా శోకసంద్రంలోకి వెళ్ళింది. మీరా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆత్మహత్యే అని, ఆమె మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్..ఫాతిమా దంపతులకు లారా అనే చిన్న కూతురు కూడా ఉంది.