Bhadrakali: విజయ్ ఆంటోనీ పొలిటికల్‌ థ్రిల్లర్.. ‌‌‌‌‌‌‌‘భద్రకాళి’ రిలీజ్ డేట్ అనౌన్స్

Bhadrakali: విజయ్ ఆంటోనీ పొలిటికల్‌ థ్రిల్లర్.. ‌‌‌‌‌‌‌‘భద్రకాళి’ రిలీజ్ డేట్ అనౌన్స్

విజయ్ ఆంటోనీ నుంచి వస్తున్న సినిమా ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ తెలుగులో విడుదల చేస్తోంది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న సినిమా విడుదల చేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌కు సురేష్ బాబు ముఖ్య​అతిథిగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ‘ఇది నా 25వ చిత్రం. పొలిటికల్ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గతంలో వచ్చిన చిత్రాలన్నింటికీ భిన్నంగా ఉండబోతోంది. నా ఫస్ట్ సినిమాను రిలీజ్ చేసిన రామ్ గారితో మళ్లీ కొలాబరేట్ అవడం హ్యాపీ’అన్నాడు.

దర్శకుడు మాట్లాడుతూ ‘నా తొలిచిత్రం ‘అరువి’రిలీజ్ టైమ్‌‌‌‌‌‌‌‌లో టాలీవుడ్ నుంచి రానా,  విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్ గార్లు నా వర్క్‌‌‌‌‌‌‌‌ని అప్రిషియేట్ చేశారు. ఈ  సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు. సామాజిక అంశాలకు వినోదం జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని నిర్మాతలు రామాంజనేయులు, ధనంజయన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.