Vijay Devarakonda Fan: బ్లడ్తో విజయ్ చిత్రం గీసిన ఫ్యాన్.. అరేయ్ మెంటల్ అంటూ రౌడీ హీరో వార్నింగ్

Vijay Devarakonda Fan: బ్లడ్తో విజయ్ చిత్రం గీసిన ఫ్యాన్.. అరేయ్ మెంటల్ అంటూ రౌడీ హీరో వార్నింగ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) చేస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star). దర్శకుడు పరశురాం పెట్ల(Parasuram Petla) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తుండగా.. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. 

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తన ఫ్యాన్స్ కు కలుసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ సందర్బంగా విజయ్ అభిమాని ఒకరు తన రక్తంతో విజయ్ చిత్రం గీసి ఆయనకు ప్రెజెంట్ చేశాడు. అయితే.. ముందుగా ఆ చిత్ర పాఠాన్ని మామూలు బొమ్మగా భావించిన విజయ్.. ఆ ఫ్యాన్ తో సెల్ఫీ దిగాడు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకున్న విజయ్ ఆ అభిమానిని వెనక్కి పిలిచి మరి తనతో మాట్లాడాడు.. బ్లడ్ ఆ.. అరే మెంటల్ ఇలాంటివి చేయొద్దు..  అంటూ ఫ్యాన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అభిమానం ఉండటంలో తప్పులేదు కానీ, మరీ ఇంతలానా. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఇది అభిమానం కాదు.. పిచ్చి, వెర్రి అంటూ ఫైర్ అవుతున్నారు.