ఈడీ విచారణకు హాజరుకానున్న విజయ్ దేవరకొండ

ఈడీ విచారణకు హాజరుకానున్న విజయ్ దేవరకొండ

టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ హాజరుకావాలని విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులిచ్చింది. లైగర్ మూవీ ఆర్థిక వ్యవహారాలపై అధికారులు ప్రశ్నించనున్నారు. లైగర్ సినిమాలో రాజకీయ నాయకుల పెట్టుబడులు ఉన్నట్లుగా ఈడీ అనుమానిస్తోంది.

ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మిలను ఈడీ విచారించింది. ప్రధానంగా సినిమా షూటింగ్‌‌ కోసం ఇద్దరి అకౌంట్స్‌‌లో డిపాజిట్‌‌ అయిన డబ్బుకు సంబంధించిన వివరాలతో స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసినట్లు తెలిసింది. సినిమా షూటింగ్‌‌ కోసం ఫారిన్‌‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, పెట్టుబడులు ఎవరు పెట్టారనే వివరాలు సేకరించింది. విదేశాల్లో జరిగిన షూటింగ్ సెట్టింగ్స్, అక్కడి నటులకు చెల్లించిన రెమ్యునరేషన్‌‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌‌ను పరిశీలించినట్లు సమాచారం. మూవీ కోసం తీసుకున్న బ్యాంక్ లోన్స్, ఇతర ప్రైవేట్‌‌  సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, విదేశాలకు డబ్బును ఏ రూపంలో తరలించారనే కోణంలో ప్రశ్నించినట్లు తెలిసింది.