మెడలో పాము, ఒడిలో పులి, సింహంతో రౌడీ హీరో

మెడలో పాము, ఒడిలో పులి, సింహంతో రౌడీ హీరో

సినిమా షూటింగుల నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు సెలబ్రిటీలు వెకేషన్‭కు చెక్కేస్తారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‭తో పంచుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.  తాజాగా.. లైగర్ హీరో విజయ్ దేవరకొండ నుండి ఫ్యాన్స్‫కు అప్ డేట్ వచ్చింది. సినిమా షూటింగులకు కాస్త గ్యాప్ ఇచ్చిన విజయ్.. కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లాడు. తాజాగా తన టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దుబాయ్‌ ట్రిప్‭లో ఈ రౌడీ హీరో సైఫ్ బెల్సాసా అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ జూ పార్క్‌లో సరదాగా గడిపాడు. అక్కడి జంతవులతో ఆటలాడాడు. ఆ తర్వాత పాములను మెడలో వేసుకున్నాడు. బోనులో ఉన్న సింహంతో తాడాట ఆడిన విజయ్.. ఏకంగా పులి పిల్లలను ఒడిలో ఆడిస్తూ వాటికి పాలు పట్టాడు. 

ఇన్ స్టాలో వీడియోలను షేర్‌ చేసిన విజయ్‌ ‘బ్యూటిఫుల్‌ గార్డెన్.. రామ చిలుకలు, పక్షులు, విచిత్రమైన జంతువులను చూడటం చాలా హ్యాపీగా ఉందన్నాడు. పాములంటే భయపడే తనకు ఆ భయాన్ని పోగొట్టిన జూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే సింహం, పులి పిల్లలతో మాట్లాడటానికి సహాయపడిన జూ సిబ్బంది, క్యూరేటర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. ‘నా లైఫ్‌లో ఇదో మధుర జ్ఞాపకం’ అని షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.