విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయన నటిస్తున్న రెండు పాన్ ఇండియా చిత్రాల నుంచి స్పెషల్ అప్డేట్స్ విడుదల చేసి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపారు మేకర్స్. ఒకవైపు ‘రౌడీ జనార్థన’ సినిమా నుంచి పవర్‌ఫుల్ బర్త్‌డే పోస్టర్ రిలీజ్ చేయగా, మరోవైపు ‘రణబాలి’ మూవీ నుంచి స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ విడుదల చేశారు. ‘రౌడీ జనార్ధన’ పోస్టర్‌లో వర్షంలో తడుస్తూ చేతిలో పిస్టల్ పట్టుకుని కనిపించిన విజయ్ లుక్ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ కీర్తి సురేష్ కాలు విజయ్ ఛాతీపై ఉంచిన విజువల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోస్టర్ ద్వారా సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చారు.
డిసెంబర్‌లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ‘రణబాలి’ మేకింగ్స్ గ్లింప్స్‌లో విజయ్ చేసిన హార్స్ రైడింగ్‌ను చూపించారు. గుర్రాలను స్వారీ చేయడం కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో, గాయాలను సైతం లెక్కచేయకుండా ఎలా ట్రైనింగ్ తీసుకున్నాడో వీడియోలో హైలైట్ చేశారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ రెండు సినిమాల అప్డేట్స్‌తో విజయ్ దేవరకొండ అభిమానులకు ఈ బర్త్‌డే మరింత ప్రత్యేకంగా మారింది.
