విజయ్, అనన్య ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే...

విజయ్, అనన్య ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే...

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే జంటగా నటించిన లైగర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో వారు బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా ఆ ఇద్దరు నటుల ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. మరి ఆఫ్ స్క్రీన్ లో వారి మధ్య బంధం ఎలా ఉంటుందో స్వయంగా వారే తెలియజేశారు. లైగర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా న్యూఢిల్లీకి చేరుకున్న ఈ స్టార్స్ ఒకరిపై ఒకరికున్న అభిప్రాయాలను పంచుకున్నారు.

విజయ్ కొన్నిసార్లు అసలు తన మైండ్ లో ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాదని అనన్య పాండే చెప్పగా... అనన్య కాఫీ పెడితే తనకు నచ్చదని, అది చాలా భయంకరంగా ఉంటుందని విజయ్ దేవరకొండ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే మళ్లీ తానే అనన్యపై ప్రశంసలు గుప్పించాడు. కేవలం 23ఏళ్ల వయసులోనే అనన్య  ఎంతో సాధించిందని.. తాను కూడా ఆ వయసులో చేయగలుగుతానో లేదోనని అన్నాడు. నిజంగా ఇది ప్రేమో కాదో తనకు తెలియదు, కానీ ఈ వయస్సులో ఆమె చేస్తున్న పనిని తాను నిజంగా ప్రశంసిస్తానని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంలోనే అనన్య పాండే విజయ్ పై ఉన్న ప్రేమను మరో రకంగా రివీల్ చేసింది. అతని ధైర్యం తనకు చాలా నచ్చుతుందని, సినిమా కథలు ఎంచుకునే విధానం, తాను ప్రవర్తించే విధానం తనకు బాగా నచ్చుతాయని తెలిపింది. ఈ సందర్భంగా అనన్య వేసే కొన్ని ప్రశ్నలను సహిస్తూ వస్తున్నానని అని విజయ్ అంటే... తనకు మంచి ఫుడ్ అందించినా కూడా తనను ప్రశంసించడని అనన్య తెలిపింది. ఇక లైగర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వారిద్దరూ దేశంలోని 17 ప్రధాన నగరాలకు పైగా పర్యటించారు. ఈ సినిమా ఆగస్టు 25న పలు భాషల్లో విడుదల కానుండడంతో వీరిద్దరూ కాస్త ఎగ్జయింట్ గా, ఇంకాస్త నెర్వస్ గా ఉన్నామని చెప్పారు. అయితే ఈ చిత్రంతో విజయ్ హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేయనుండగా... అనన్య కు ఇది మొదటి బహుభాషా చిత్రం.