విజయ్... మరో మూడు కొత్త సినిమాలు

 విజయ్... మరో మూడు కొత్త సినిమాలు

‘లైగర్’ సినిమా నిరాశ పరచినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఓ వైపు వరుస కమర్షియల్ యాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తోన్న విజయ్, మరోవైపు మూడు కొత్త సినిమాలకు కమిట్ అవ్వబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయనున్నాడని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుండి కూడా రెండు అవకాశాలు వచ్చినట్టు సమాచారం. అందులో ఓ చిత్రం ‘లైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కి నిర్మాతగా వ్యవహరించిన కరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉండనుంది. ఇక షారుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిల్లీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ.. విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఓ రొమాంటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు టాక్. ఇక ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోన్న ‘ఖుషి’లో నటిస్తున్నాడు విజయ్. సమంత హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇష్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి బ్రేక్ పడింది. దీంతో రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల విజయ్ స్పందించాడు. ‘అరవై శాతం షూటింగ్ పూర్తయింది, డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేద్దామనుకున్నాం, కానీ పలు కారణాల వల్ల వచ్చే యేడాది ఫిబ్రవరిలో రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలనుకుంటున్నాం’ అని చెప్పాడు. మురళీశర్మ, వెన్నెల కిశోర్, రోహిణి, అలీ, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.