
తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఎమోషనల్ డ్రామా మహారాజ(Maharaja). ఈ మూవీ వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసేందే. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో 100 కోట్లకి పైగా వసూల్ చేసి చరిత్ర సృష్టించిన ఈ మూవీ విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ చిత్రం గా రావడం విశేషం.
ఇప్పుడు బాలీవుడ్లో మహారాజని రీమేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే మహారాజ సినిమా హక్కులని అమీర్ ఖాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విభిన్న కథలతో సూపర్ హిట్ కొట్టే అమీర్ ఖాన్ లాస్ట్ గా వచ్చిన లాల్ సింగ్ చద్దా సినిమాతో డిసాస్టర్ ఇచ్చాడు. అమీర్ ఖాన్ కెరీర్ చూసుకుంటే ఎక్కువగా మన సౌత్ రీమేక్ సినిమాల తోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే మన సౌత్ లో ప్రేక్షకలను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమాని ఏమైనా మార్పులు చేస్తారా లేదా ఉన్నది ఉన్నట్లు తీస్తారా అన్నది తెలియాలి.
గతేడాది నుంచి మన సౌత్ సినిమాలు బాలీవుడ్ కి అంత కలిసిరావడం లేదు.ఇక్కడ సూపర్ హిట్ కొట్టిన సినిమాలు అక్కడ రీమేక్ చేస్తే డిజాస్టర్స్ అవుతున్నాయి.రీసెంట్ గా సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని రీమేక్ చేయగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పడు తాజా ఇండస్ట్రీ హిట్ మహారాజ మూవీతో అమిర్ ఏ మాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.