Mahesh Babu: ఆడియన్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది..‘రాయన్‌’పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ఆడియన్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది..‘రాయన్‌’పై మహేష్ బాబు రివ్యూ

కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన మూవీ ‘రాయన్’(RAAYAN). కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం జూలై 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చిన రాయన్ థియేటర్లలో రిలీజై  ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ మేరకు వీకెండ్ స్పెషల్గా ఆడియన్స్ నుంచి సినీ హీరోల వరకు రాయన్ ను చూడటానికి ఇంట్రెస్ట్ చూపారు. అంతేకాకుండా సినిమాపై ఏర్పడిన తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రాయన్ మేకర్స్ పై ప్రశంసలు కురిపించాడు. 

‘‘అద్భుతమైన దర్శకత్వంతో పాటు బ్రిలియంట్ యాక్టింగ్తో ధనుష్‌ అదరగొట్టారు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్‌రాజ్‌, సందీప్ కిషన్‌లు ఉత్తమంగా నటించారు. ఈ మూవీలో ఉన్న ప్రతిఒక్కరూ వందశాతం మంచి నటన కనబరిచారు. ఇకపోతే ఈ సినిమాకి బ్యాక్ బోన్గా నిలిచినా మ్యాస్ట్రో ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం మరో అద్భుతం. ‘రాయన్‌’ కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’’ అని మహేష్ ట్విట్టర్ X ద్వారా రాసుకొచ్చారు.

ఈ పోస్ట్‌కు సందీప్‌ కిషన్‌ స్పందిస్తూ.."ధన్యవాదాలు సర్..సో స్వీట్ ఆఫ్ యు ..మీరు సినిమాను ఆస్వాదించినందుకు ఆనందంగా ఉంది" అని రిప్లై ఇచ్చారు. అలాగే కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌.. 'రాయన్ అద్భుతమైన విజయం సాధించినందుకు చిత్రబృందాన్నికి శుభాకాంక్షలు' అంటూ లోకేష్ పోస్ట్ చేశారు. భారతదేశంలో మొదటి వారాంతంలో రాయన్ రూ.42.65 కోట్లు వసూలు చేసింది.