Happy Birthday Sonu Sood: హెల్పింగ్ స్టార్కి శుభాకాంక్షల వెల్లువ..రియల్ హీరో సోనూ గురించి ప్రత్యేక విశేషాలు

Happy Birthday Sonu Sood: హెల్పింగ్ స్టార్కి శుభాకాంక్షల వెల్లువ..రియల్ హీరో సోనూ గురించి ప్రత్యేక విశేషాలు

క‌రోనా స‌మ‌యంలో సాయం చేస్తూ హెల్పింగ్ స్టార్గా మారిపోయిన సోనూసూద్ (Sonu Sood) దేశవ్యాప్తంగా ఎంతో మందికి సేవ‌లు చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. లాక్ డౌన్ కాలంలో ఎంతోమంది కార్మికుల‌ను తన సొంత ఖర్చుల‌తో వారి సొంతిళ్ల‌కు పంపి అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకున్నారు సోనూ. ఆయన సాయం చేస్తే ఒక ప్రాణం నిలబడుతుంది. ఒక కుటుంబం బతుకుతుంది. ఒక దేశం గర్విస్తోంది. అంతేకాదు..డబ్బున్న ఎంతో మంది ధనవంతులకు కనువిప్పు అవుతుంది.

ఆయన గురించి ఇంకాస్తా లోతుగా అర్ధం అయ్యేలా చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం ప్రతో ఒక్కరిలో సాయం చేయాలనే తపన అంత. కాపాడుకోవాలనే ఆశ అంత. ఇక అంత ఇంతా కాదు..'మనం కాపాడాలని ప్రయత్నిస్తున్న వ్యక్తిని కోల్పోవడం సొంత వాళ్లను కోల్పోవడం కంటే తక్కువేం కాదు అనుకునే అంత. ఒక వ్యక్తిని రక్షిస్తామని మాట ఇచ్చిన కుటుంబాన్ని కి ప్రమాదంలో ఆ వ్యక్తిని కోల్పోతే నిస్సహాయుడిగా మారిపోయి భావోద్వేగంతో మారే మంచి మనసు సోనూసూద్ కి సొంతం. నేటికీ మారుమూలాల ఉన్న పేదలకు సహాయం చేస్తున్నాడు. అందుకే ఆయనను ‘పేదల దూత’ అని కూడా పిలుస్తారు. నేడు జూలై 30న సోనూసూద్ తన 51వ పుట్టిన రోజు కావడంతో ప్రపంచవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి విషెష్ అందుతున్నాయి. 

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోను సూద్ కి బర్త్ డే విషెష్ తెలియజేశారు. " పుట్టినరోజు శుభాకాంక్షలు సోనూసూద్..మీరు లెక్కలేనన్ని జీవితాలను తాకారు మరియు మార్చారు. ప్రజలకు సహాయం చేయడం పట్ల మీ కరుణ మరియు అంకితభావం స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మీ అన్ని ప్రయత్నాలలో మీ నిరంతర విజయం, ఆనందం కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను" అంటూ పోస్ట్ చేశారు. 

సోనూ సూద్ మొత్తం ఆస్తులు 140 కోట్ల రూపాయలు ఉంటుందని ట్రేడ్ నిపుణుల అంచనా. సోనూ సూద్‌కు సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్లు అలాగే అతను నడుపుతున్నహోటళ్ల నుంచి భారీగా సంపాదిస్తున్నారు. వచ్చే ఆదాయంలో కొంత సామజిక పనులకు వినియోగిస్తున్నాడు. సోనూసూద్ ఒక్కో సినిమాకు 2-5 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)

1996 లో యాక్టర్ అవ్వాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ముంబై వచ్చాడు. ఆ సమయంలో అతని వద్ద కేవలం రూ.5500 మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అతని జీవితం అంత సులభంగా సాగలేదు. లోకల్ రైలులో ప్రయాణించేవాడు. తినడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ఇక తన ప్రయాణంలో చాలా కష్టపడి 1999లో ఒక తమిళ సినిమాలో నటించే అవకాశం సంపాదించాడు. అతని నటనా జీవితం ఇక్కడ నుంచే ప్రారంభమైంది. అలాగే, సోనూ సూద్ తన ఫస్ట్ బాలీవుడ్ చిత్రం ‘షహీద్-ఎ-ఆజం’. ఈ  అవకాశాన్ని 2002 సంవత్సరంలో అందుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు పలు భాషల్లో నటిస్తూ తిరుగులేని రారాజు అయ్యాడు. ఇకపోతే..రీల్ హీరోలు మనదగ్గర చాలా మంది ఉన్నారు. కానీ రియల్ హీరోలు మాత్రం చాలా అరుదు. అలాంటి అందరి హీరోకి జన్మదిన శుభాకాంక్షలు.

సోనూసూద్‌కి కార్లపై పెద్దగా వ్యామోహం లేదు. ఆయన దగ్గర పోర్షా పనామెరా, బెంజ్ ఎంఎల్ క్లాస్ కార్లు ఉన్నాయి. మిగిలినవి ఉన్న అవి చిన్న కార్లు. అలాగే సోనూసూద్‌కు సొంత నిర్మాణ సంస్థ ఉంది. వీటితోపాటు సోనూసూద్‌కి ముంబైలో పెద్ద ఇల్లు ఉంది. అలాగే సొంత రెస్టారెంట్ కూడా ఉంది.అలాగే ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. 

ప్రత్యేక కథనాలు:

ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాకు, మదనపల్లెలో ఒక రైతు తన పొలాన్ని దున్నడానికి ఎద్దులు లేక, కూలీలకు డబ్బులు ఇవ్వలేక చివరికి తన సొంత కూతుళ్లను కాడెద్దులుగా మార్చి పొలం దున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోని చూసినా సోనుసూద్ వెంటనే స్పందించి పొలం పనుల కోసం ట్రాక్టర్‌ ఇచ్చాడు. 

కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాస్‌లకే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్లు లేక పాఠాలు వినలేక పోతున్నారని ఉత్తర ప్రదేశ్ లక్నోలో సమీప గ్రామాల్లోని పేద విద్యార్థినిలకు స్మార్ట్‌ ఫోన్లు అందజేశాడు. 40 గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది పేద విద్యార్థినులకు ఆయన మొబైల్‌ ఫోన్లు పంపిణీ చేశారు. 

కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో సూద్ వేలాది మంది భారతీయ వలస కార్మికులకు బస్సులు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాడు.

కిర్గిజ్స్తాన్‌లో చిక్కుకున్న 1,500 మంది భారతీయ విద్యార్థుల స్వదేశానికి తీసుకు రావడానికి సోను సూద్ వాళ్ళకి విమానాలను ఏర్పాటు చేసాడు

నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీ ఇచ్చాడు. 

వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తానని వెల్లడించడం. 

ఇవే కాదు..ఎన్నో పలు సామజిక కార్యక్రమాలు చేస్తూ దేశానికే రోల్ మోడల్ గా మారి న్నో ఎన్నో గౌరవాలు అందుకున్నాడు.  ‘హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020' పేరుతో ఇలా ఎన్నో ఆయనని వరించాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)