
రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతోంది. ఇప్పటికే పాటలతో ఇంప్రెస్ చేసిన మేకర్స్..మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం..ఈ మూవీలో ఓ యంగ్ హీరో గెస్ట్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. తన పేరునే DJ టిల్లు అని పిలుచుకునేలా అలవాటు చేసిన యంగ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. అయితే, ఈ హీరో రవితేజతో వచ్చ భారీ యాక్షన్ పార్ట్ లో కనిపించనున్నాడట. అందుకోసం కళ్లు చెదిరే విధంగా డైరెక్టర్ హరీష్ శంకర్ పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నట్లు టాక్.
అలాగే రవితేజతో సిద్ధు తలపడే యాక్షన్ సీన్స్ మిస్టర్ బచ్చన్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ సర్కిల్ లో వినిపిస్తోంది.ఇపుడు ఈ వార్తా ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ ఇవ్వనుంది. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ను తెరకెక్కిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే సిద్ధూ తెలుసు కదా అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్ట్ చేస్తోంది.
ఇకపోతే మిస్టర్ బచ్చన్ నుంచి రిలీజ్ చేసిన టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇందులో సిన్సియర్ ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా వింటేజ్ లుక్‌లో రవితేజ కనిపించాడు. ‘ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్..నల్లధనం..సక్సెస్,ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాలాంటివి..వస్తుంటాయ్, పోతుంటాయ్..యాటిట్యూడ్ ఇంటిపేరు లాంటిది..అది పోయేదాకా మనతోనే ఉంటుంది’ అని రవితేజ చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.భాగ్య శ్రీ బోర్సే గ్లామర్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, ఝాన్సీ ఇతర పాత్రల్లో కనిపించారు.