డార్క్ కామెడీతో విజయ్ సేతుపతి ఏస్

డార్క్ కామెడీతో విజయ్ సేతుపతి  ఏస్

విజయ్ సేతుపతి హీరోగా అరుముగ కుమార్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఏస్’. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌‌గా నటించగా, దివ్యా పిళ్లై, పృథ్వీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.  శుక్రవారం (May 23) సినిమా విడుదల కానుంది.  శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై  బి. శివ ప్రసాద్ తెలుగులో రిలీజ్  చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌‌లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘అరుముగ కుమార్ నాకు సినిమాలో మొదటి చాన్స్ ఇచ్చిన వ్యక్తి.   మళ్లీ ఇప్పుడు ఆయనతో పనిచేస్తుండటం ఆనందంగా ఉంది.

ఇందులో యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలు ఉంటాయి. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.  తెలుగు డబ్బింగ్ చాలా బాగా వచ్చింది. ఇక్కడి ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని నమ్మకం ఉంది’ అని అన్నాడు.   డార్క్ కామెడీతో రాబోతున్న ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుందని దర్శక నిర్మాత అరుముగ కుమార్ చెప్పాడు. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని దివ్యా పిళ్లై, పృథ్వీ చెప్పాడు.  

నిర్మాత బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ కథ, క్యారెక్టర్స్ అన్నీ అద్భుతంగా ఉండబోతున్నాయి. విజయ్ సేతుపతి గారు మళ్లీ అందరినీ ఆకట్టుకోబోతున్నారు. అన్ని సెట్ అయితే ఆయనతో  ‘రొమాంటిక్ డాన్’ అనే సినిమాను త్వరలోనే  ప్రకటిస్తాను’ అని చెప్పారు.