
హీరోగానే కాక విలక్షణ నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును అందుకున్న విజయ్ సేతుపతి.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మహారాజా, మేరీ క్రిస్మస్, ముంబైకర్, జవాన్ లాంటి సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. ఇవి కాక మరో కొత్త చిత్రానికి కమిటయ్యాడు.
ఈ మూవీ మలేషియాలోని ఓ దేవాలయంలో పూజాకార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. సెవెన్ సిఎస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుండగా.. ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ హీరోయిన్ రుక్మిణి ఫిమేల్ లీడ్‌గా చేస్తోంది. యోగిబాబు కీలకపాత్ర పోషిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ‘మహారాజా’ అనే చిత్రంతో 50 సినిమాలు పూర్తి చేసిన మక్కల్ సెల్వన్‌కి ఇది 51వ చిత్రం.