
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రం ‘మహారాజ’. తన కెరీర్‌లో ఇది 50వ చిత్రం. మమతా మోహన్ దాస్, అభిరామి హీరోయిన్స్. నితిలన్ సామినాథన్ దర్శకుడు. సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఈనెల 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. ఎన్‌విఆర్ సినిమా సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఈ సినిమా వెరీ స్పెషల్. స్క్రీన్ ప్లే హైలైట్‌గా నిలుస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ ‘తమిళంలో కొంత బ్రేక్ తర్వాత చేసిన సినిమా ఇది. చాలా మంచి స్క్రిప్ట్‌లో భాగమవడం ఆనందంగాఉంది. యూనిక్ స్క్రీన్ ప్లేతో రాబోతోంది’ అని చెప్పింది. మంచి కథ, మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని అంది అభిరామి. విజయ్ సేతుపతి గారి 50వ సినిమా డైరెక్ట్ చేయడం హ్యాపీ అన్నాడు. దర్శకుడు నితిలన్ సామినాథన్. నిర్మాత ఎన్వీ ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..