Phoenix Teaser: విజయ్ సేతుపతి కొడుకు హీరోగా ఎంట్రీ.. యాక్షన్‌‌ విత్ ఎమోషన్‌‌తో ‘ఫీనిక్స్’

Phoenix Teaser: విజయ్ సేతుపతి కొడుకు హీరోగా ఎంట్రీ.. యాక్షన్‌‌ విత్ ఎమోషన్‌‌తో ‘ఫీనిక్స్’

విజయ్ సేతుపతి కొడుకు సూర్య హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఫీనిక్స్’. వర్ష హీరోయిన్. స్టంట్ మాస్టర్ అనల్ అరసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు.

శనివారం ఫీనిక్స్ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌లో సూర్య సేతుపతి మాట్లాడుతూ ‘నాపై నమ్మకంతో  అనల్ అరసు గారు ఈ సినిమా కోసం నన్ను సెలెక్ట్ చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నా. ఇందులో యాక్షన్‌‌తో పాటు అద్భుతమైన ఎమోషన్ కూడా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్న ధనుంజయన్ గారికి థ్యాంక్యూ సో మచ్ అని చెప్పాడు.

ఇది తన ఫస్ట్ మూవీ, వెరీ స్పెషల్ అని హీరోయిన్ వర్ష చెప్పింది. అనల్ అరసు మాట్లాడుతూ ‘ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవడం ఆనందంగా ఉంది. ఫైట్ మాస్టర్‌‌‌‌గా పెద్ద పెద్ద సినిమాలు చేశాను. అయితే యాక్షన్‌‌లో కూడా ఒక కొత్తదనం ఉండాలని ప్రయత్నంతో  ఈ సినిమా చేశా. సూర్య చాలా హార్డ్ వర్కర్. తన యాక్టింగ్ అందరికీ నచ్చుతుంది’అని అన్నారు. నిర్మాతలు ధనంజయన్, రాజ్యలక్ష్మి, రైటర్ భాష్యశ్రీ పాల్గొన్నారు.