
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) టాలీవుడ్, కోలీవుడ్ లో తన సహజ నటనతో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. హీరోగా, విలన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన 50వ మూవీ గురుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
మహారాజా(Maharaja) అనే టైటిల్ తో మూవీ రాబోతున్నట్లు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో 'చుట్టూ ఎముందో అదే వస్తుంది' అంటూ ఆసక్తికర పదాలు ఉండటంతో పాటు.. ఒక రాజు..ఆ రాజు తలపై చదరంగపు పావు.. దానిపై ఓ పక్షి..ఇలా కథపై మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలిగించారు డైరెక్టర్.
ఈ మూవీకు 'కురంగు బొమ్మై' ఫేమ్ దర్శకుడు నితిలన్ స్వామినాథన్( Nithilan Swaminathan) డైరెక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. మహారాజా స్టోరీ లో ఇంట్రెసింగ్ అంశాలు చాలా ఉంటాయని, ఈ మూవీ స్క్రీన్‌ప్లే ప్రత్యేకంగా ఉంటుందని..దర్శకుడు నిథిలన్ వివరించారు.
ప్యాషన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ మరియు నట్టి నటరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా అభిరామి, అరుల్ దాస్, మునిష్కాంత్, బాయ్స్ మణికందన్, సింగం పులి, భారతీరాజా, వినోద్ సాగర్, పిఎల్ తేనప్పన్ మరికొంత మంది ప్రముఖ నటులు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు.