‘మా‘ ఎన్నికల్లో సీవీఎల్ కు విజయశాంతి సపోర్ట్

‘మా‘ ఎన్నికల్లో సీవీఎల్ కు విజయశాంతి సపోర్ట్

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకి ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే నలుగురు అభ్యర్థులు ప్రకాశ్ రాజ్, మంచువిష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ పోటీచేస్తుండగా యాక్టర్ సీవీఎల్ నరసింహరావు తాను కూడా మా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో ఈ సారి ఐదుగురు అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు ప్రకాశ్ రాజ్ కు మద్దతు తెలిపారు. దీంతో మెగా ఫ్యామిలీ మద్దతు ప్రకాశ్ రాజ్ కు ఉంటుందని తెలుస్తోంది. మంచు విష్ణు తన తండ్రితో కలిసి సూపర్ స్టార్ కృష్ణను కలిశారు. దీంతో సూపర్ స్టార్ మహేశ్ మద్దతు కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే లేటెస్ట్ గా నటి విజయశాంతి మా ఎన్నికలపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. సీవీఎల్ నరసింహరావు ఆవేదన న్యాయమైంది, ధర్మమైంది అని అన్నారు. తాను ‘మా‘ సభ్యురాలు కాకపోయినా కళాకారిణిగా స్పందిస్తున్నానన్నారు. చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీఎల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నానన్నారు.