Gilli Re-Release: రీ రిలీజ్లో కలెక్షన్ల ఊచకోత.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విజయ్ గిల్లి

Gilli Re-Release: రీ రిలీజ్లో కలెక్షన్ల ఊచకోత.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విజయ్ గిల్లి

తమిళ స్టార్ విజయ్ తలపతి(Vijay Thalapathy) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఆయనకన్నా ఎక్కువ ఆయన సినిమాల కలెక్షన్స్ మాట్లాడ్తాయి. ఎంతలా అంటే.. అప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యి కొత్త రికార్డ్స్ సెట్ అవ్వాలి. అంతలా ఆయనంటే ఇష్టపడతారు ఫ్యాన్స్. తాజాగా ఆలాంటి ఇన్సిడెంట్ మరొకటి జరిగింది. అదేంటంటే.. ఇటీవల సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అందులో భాగంగానే విజయ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ గిల్లి(Gilli) సినిమాను రీ రిలీజ్ చేశారు మేకర్స్.   

ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలన్నీ  మహా అయితే అయిదు లేదా ఆరు కోట్ల కలెక్షన్స్ సాధించాయి. అది కూడా రెండు, మూడు రోజులకు. కానీ గిల్లి సినిమా ఒకరోజులోనే పది కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన ఏ సినిమా కూడా కలెక్ట్ చేయని రేంజ్ లో ఈ సినిమా కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాల ఆశ్చర్య పరిచింది. చాలా మంది స్టార్స్ కొత్త సినిమా రిలీజ్ కు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం చాలా కష్టం. అలాంటిది ఒక రీ రిలీజ్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది మాములు విషయం కాదు. అది కేవలం విజయ్ క్రేజ్ వల్లనే సాధ్యం అయిందని కామెంట్స్ చేస్తున్నారు తలపతి ఫ్యాన్స్. మరో రెండు రోజులు ఈ సినిమా థియేటర్స్ లో కొనసాగనుంది కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఇక విజయ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). విలక్షణ చిత్రాల దర్శకుడు  వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి హీరో ప్రశాంత్ కీ రోల్ చేస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.