సంక్రాంతికి విడుదల కానున్న వారసుడు

సంక్రాంతికి విడుదల కానున్న వారసుడు

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీపైడిపల్లి రూపొందిస్తున్న చిత్రం ‘వారసుడు’. తెలుగు, తమిళ భాషల్లో దిల్ రాజు, పీవీపీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం రెండో పాటను విడుదల చేశారు.

‘థీ’ దళపతి అంటూ సాగే తమిళ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హీరో శింబు పాడటంతో మరింత హైప్ వచ్చింది. తమన్ కంపోజ్ చేయగా, విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలివేట్ చేస్తూ వివేక్ లిరిక్స్ రాశాడు. ఫైరింగ్ బ్యాగ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న విజువల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. ఆల్రెడీ విడుదలైన రంజితమే పాట యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిలియన్ వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దూసుకుపోతోంది. ఈ సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుందన్నారు దర్శక నిర్మాతలు. రష్మిక మందన్న హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోన్న  ఈ చిత్రంలో శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, ప్రభు, ప్రకాష్  రాజ్, జయసుధ, సంగీత ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.