తొక్కిసలాట మృతుల కుటుంబాలకు విజయ్‌‌‌‌ వీడియో కాల్‌‌‌‌.. అండగా ఉంటానంటూ ఓదార్పు

తొక్కిసలాట మృతుల కుటుంబాలకు విజయ్‌‌‌‌ వీడియో కాల్‌‌‌‌.. అండగా ఉంటానంటూ ఓదార్పు

చెన్నై: కరూర్‌‌‌‌‌‌‌‌ తొక్కిసలాట మృతుల కుటుంబాలతో తమిళగ వెట్రీ కజగం(టీవీకే) పార్టీ చీఫ్‌‌‌‌ విజయ్ వీడియో కాల్‌‌‌‌లో మాట్లాడారు. విజయ్‌‌‌‌ ఐదు కుటుంబాలతో ఫోన్‌‌‌‌లో మాట్లాడి ఓదార్చారు. వారి కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు. 

అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 27న తమిళనాడులోని కరూర్‌‌‌‌‌‌‌‌లో తన ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చిన్నారులతోసహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. 

ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత విజయ్ బాధిత కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మంగళవారం (అక్టోబర్ 07) ఫోన్‌‌‌‌లో పరామర్శించారు.