నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సక్సెస్ చిత్రాలను డైరెక్ట్ చేసిన కె.విజయ భాస్కర్ పదేళ్ల గ్యాప్ తర్వాత రూపొందిస్తున్న సినిమా ‘జిలేబి’. విజయ్ భాస్కర్ కొడుకు శ్రీకమల్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. శివాని రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. బ్యాంకాక్‌లో రెండు పాటలని షూట్ చేశారు. దీంతో షూట్ అంతా పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టామన్నారు మేకర్స్. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.