టీచర్లకు అన్యాయం చేస్తున్నరు

టీచర్లకు అన్యాయం చేస్తున్నరు

హైదరాబాద్, వెలుగు: ఉద్యమాలు చేసి, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగుతోందని బీజేపీ లీడర్ విజయశాంతి ఫైర్ అయ్యారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. న్యాయంగా వారికి రావాల్సిన ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో విజయశాంతి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. సర్కారు ఇటీవల రిలీజ్ చేసిన జీవో 317తో టీచర్ల స్థానికతకే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంతో వేరే జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు.  జనాభా ప్రకారం ఏ జిల్లాలోనైనా తక్కువ పోస్టులుంటే, ఇతర జిల్లాల్లోని  ఖాళీలను ఆ జిల్లాలకు కేటాయించాలని లేదా సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలన్నారు. అదికూడా సాధ్యం కాకపోతే కొత్తవారిని రిక్రూట్ చేయాలని చెప్పారు. ఇప్పటికైనా జీవో 317ను వెనక్కి తీసుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పరిష్కారం చూపాలని విజయశాంతి డిమాండ్ చేశారు.