
హైదరాబాద్, వెలుగు : బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి పార్కులో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పార్కులో ఈ నెల 27లోగా యెగా, మెడిటేషన్ సెంటర్‌ను ప్రారంభించాలన్నారు. చెరువు నీటిని క్లీన్ చేసి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎంటమాలాజిస్ట్ రాంబాబును ఆదేశించారు. వాకర్స్ కోసం ప్రత్యేకంగా వసతులు కల్పించాలని మేయర్ సూచించారు.