మోదీ, కేసీఆర్ ఒక్కటే ! : విజయశాంతి

మోదీ, కేసీఆర్ ఒక్కటే ! : విజయశాంతి
  • కేసీఆర్ అవినీతి పరుడంటూనే ఎందుకు చర్యలు తీసుకోలే
  • బీజేపీలో ఉన్న నేత అసైన్డు భూములు ఏమయ్యాయి.. కేసు ఏమైంది?
  • తెరముందు ఒకటి, తెర వెనుక ఒకటి.. నమ్మించి మోసం చేస్తున్నారు
  • నన్ను తిట్టే హక్కు మీకు లేదు. కేసీఆర్ ఇచ్చే డబ్బులకు మీలా లొంగిపోను
  • నాపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. నోరు అదుపులో పెట్టుకోండి 
  • ఎలక్షన్లకు 4 నెలల ముందు బండి సంజయ్ ని మార్చొద్దంటే వినలే
  • ఆ పార్టీని వాళ్లకు వాళ్లే భూస్థాపితం చేసుకున్నరు
  • మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత విజయశాంతి 

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని బయటికి తీసి లోపలేస్తామని చెబుతూ నెలలు గడిపారన్నారు. మోదీ అవినీతికి వ్యతిరేకమని బీజేపీ హైకమాండ్ చెప్తుందని, కేసీఆర్ అవినీతి పరుడని కూడా అంటుందని ఆరోపించారు. మోదీ వద్ద కేసీఆర్ కుటుంబం అవినీతి వివరాలున్నాయని అన్నారు. కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

ఇవాళ గాంధీభవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోడీ అందరూ కేసీఆర్ అవినీతి పరుడు అంటారు.. ఎందుకు చర్యలు తీసుకోలేదు అని విజయశాంతి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనేది అర్థం అయ్యింది.. తెర ముందు ఒకటి, తెర వెనుక ఒకటి మాట్లాడుతున్నారు.. బీజేపీ కార్యకర్తలు, నాయకులను మోసం చేస్తుంది.. నమ్మించి మోసం చేస్తున్నారు. ’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ నాటిన విత్తనమే బీజేపీలో సంజయ్ ని మార్చేసింది అని ఆమె ఆరోపించారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు బండి సంజయ్ ని మార్చొద్దని చెబితే వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీజేపీలో ఉన్న నేత అసైన్డ్ భూములు ఏమయ్యాయి.. కేసు ఏమైంది.. ఆలోచించండి.’అంటూ పరోక్షంగా ఈటల రాజేందర్ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ లీడర్లే స్వయంగా పార్టీని నాశనం చేసుకుంటున్నారని ఆరోపించారు. మేడిగడ్డ పిల్లర్లు కూలి పోతుంటే ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. తపను తిట్టే హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. కేసీఆర్ ఇచ్చే డబ్బు కోసం పనిచేసే వ్యక్తిని తాను కాదని, మీలాగా లొంగిపోను అంటూ ఫైర్ అయ్యారు. తనకు అద్వానీ గురువని, ఆయనే సంస్కారం నేర్పారని చెప్పారు.