ప్రాంతేతర పార్టీల ప్రయోగశాలగా తెలంగాణ

ప్రాంతేతర పార్టీల ప్రయోగశాలగా తెలంగాణ

హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించిన నాటి నుంచి తెలంగాణ రాజకీయాలు ప్రాంతేతర పార్టీల ప్రయోగశాలగా మారుతూ వస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి బుధవారం ఒక ప్రటనలో అభిప్రాయ పడ్డారు.

తెలంగాణ వచ్చింది మొదలు రాష్ట్ర ప్రజలకు ఎనిమిదేండ్లుగా కేసీఆర్ ఎన్నో వైపరీత్య, విచిత్రాలను చూపిస్తూనే ఉన్నారని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్లాలనే ఆశతో.. పక్క రాష్ట్రాల పార్టీలు తెలంగాణకు వచ్చే కార్యాచరణ చేస్తున్నారని ఆరోపించారు.