సడెన్ సప్రైజ్..అదిరిన విజయశాంతి ఫస్ట్ లుక్ పోస్టర్

సడెన్ సప్రైజ్..అదిరిన విజయశాంతి ఫస్ట్ లుక్ పోస్టర్

సరిలేరు నీకెవ్వరు టీం అభిమానుల్ని సడన్ సప్రైజ్ చేసింది. దివాళీ కానుకగా లేడీ అమితాబాద్ విజయశాంతి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. వరుస సక్సెస్ సినిమాలతో మరింత వేగంగా దూసుకెళుతున్న హీరో మహేష్ బాబు, డైరక్టర్ అనిల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. 90లలో లేడీ అమితాబ్ గా స్టార్ డమ్ ను సంపాధించిన విజయ శాంతి 13ఏళ్ల తరువాత ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ మూవీ డైరక్టర్ అనిల్ రావిపుడి ..విజయశాంతి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాడు. ఈ సినిమాలో లేడి అమితాబ్ కాబట్టి విజయశాంతి రాయల సీమ ప్రాంతానికి చెందిన పవర్ ఫుల్ లేడీగా కనిపిస్తారని అభిమానులు ఊహించారు. కానీ సరిలేరు నీకెవ్వరూ టీం విడుదల చేసిన పోస్టర్ లో భారతి పాత్రలో విజయశాంతి చాలా డీసెంట్ గా కనిపిస్తూ అభిమానుల్ని  సప్రైజ్ చేస్తోంది.