విమోచనానికి, విలీనానికి తేడా తెల్వదా?

V6 Velugu Posted on Sep 19, 2021

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, టీఆర్ఎస్​పార్టీలు విమోచనాన్ని విలీన దినోత్సవంగా నిర్వహించాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సెప్టెంబర్17 తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందించిన రోజని, ఈ గడ్డ ప్రజలు రజాకార్ల అధికార నియంతృత్వం నుంచి విమోచనం పొందితే దాన్ని భారతదేశంలో విలీనం కింద నిర్వహించుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్​పార్టీలకు విమోచనకు, విలీనానికి తేడా తెలియడం లేదన్నారు. టీఆర్ఎస్​పార్టీకి ప్రభుత్వం తరఫున అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు ధైర్యం చాలడం లేదని మండిపడ్డారు.
 

Tagged TRS, Congress, September 17, vijayashanti, Merge, redemption

Latest Videos

Subscribe Now

More News