RRR సినిమాకి ఎన్టీఆర్ సపోర్ట్.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్

RRR సినిమాకి ఎన్టీఆర్ సపోర్ట్.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్

ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్(RRR) సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ కు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది ఈ మూవీ. ఇక సినిమాలో రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(Ntr) ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. రాజమౌళి విజన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన నటన వెరసి ఆర్ఆర్ఆర్ ఇండియన్ ప్రైడ్ గా నిలబెట్టాయి. 

అయితే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ స్టార్ హీరోలు కాబట్టి.. సినిమాలో ఎవరిదీ మెయిన్ క్యారెక్టర్, ఎవరి పాత్ర హైలెట్ కానుంది అనే కామెంట్స్ సినిమా రిలీజ్ కు ముందు వినిపించాయి. సినిమా చూశాక ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఒక పాత్ర లేకుండా మరో పాత్ర లేదు అన్నట్లుగా ఇద్దరినీ నెక్స్ట్ లెవల్ ప్రెజెంట్ చేశారు రాజమౌళి. అయినప్పటికి ఆ కామెంట్స్ మాత్రం ఆగలేదు. తాజాగా మరోసారి ఇదే విషయం తెరపైకి వచ్చింది. దానికి కారణం విజయద్రప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ది సపోర్టింగ్ పాత్ర అని చెప్పడమే. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తారక్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ విజయేంద్రప్రసాద్(Vijayendraprasad) ఆసక్తికర కామెంట్స్ చేశారు.. మాకు సీతారామరాజు, కొమురం భీం రెండు పాత్రలు సమానమే. ఒక పాత్ర ఎక్కువ, ఒక పాత్ర తక్కువ అనే భావన మాకెప్పుడూ లేదు. అసలు ఆ ఆలోచన కూడా మాకు రాదు. రెండు పాత్రలను సమానం అనుకునే మొదలుపెట్టాం. కాకపోతే రామ్ చరణ్ పాత్రలో వేరియేషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం కనిపిస్తుంది. నిజానికి కొమురం భీమ్ పాత్ర చేయడం చాలా కష్టం. కథ మొత్తానికి అదే సపోర్ట్. సినిమాని ముందుకు నడిపించడంలో ఆ పాత్ర ప్రధానం.. అంటూ చెప్పుకొచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో ఎక్కడా ఎన్టీఆర్ పాత్రని తక్కువ చేసి మాట్లాడలేదు ఆయన. నిజానికి కొమురం భీమ్ పాత్ర చేయడమే చాలా కష్టమని కూడా చెప్పారు. సినిమాలో అదే మెయిన్ అండ్ సపోర్ట్ పాత్రని చెప్పడం ఆయన ఉద్దేశం. దాన్ని తప్పుగా అర్థంచేసుకున్న కొంతమంది సోషల్ మీడియాలో నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.