వారసుడు సినిమా అప్ డేట్

వారసుడు సినిమా అప్ డేట్

దళపతి విజయ్, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం వారసుడు సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై చిత్రీకరించిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదలచేయబోతున్నారు. మూడు వారాల క్రితం ఆ సినిమాకు సంబంధించి రంజితమే పాటను తమిళంలో విడుదల చేశారు. ఇప్పుడు అది 114 మిలియన్ వ్యూస్ ని సంపాధించింది. 

ఇప్పటికీ ఆ పాటను తెలుగులో విడుదల చేయకపోయే సరికి విజయ్ అభిమానులు కొంత నిరుత్సాహపడ్డారు. దాంతో చిత్రబృందం ఈ పాట తెలుగు వెర్షన్ ని ఇవాళ (నవంబర్ 30)న విడుదల చేసింది. ఈ పాటకు తెలుగు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాశారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అనురాగ్ కులకర్ణి, మానసి స్వరాలు అందించారు. అయితే సంక్రాంతికి విడుదల అయ్యే ఈ సినిమా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాల‌కృష్ణ నటించిన వీర సింహారెడ్డికి పోటీ వచ్చే అవకాశం ఉంది.