భార్య ఆచూకీ కోసం డెడ్ లైన్ పెట్టిన బీఎస్పీ నేత అరెస్ట్

భార్య ఆచూకీ కోసం డెడ్ లైన్ పెట్టిన బీఎస్పీ నేత అరెస్ట్

వికారాబాద్: తన భార్య ఆచూకీ కనిపెట్టకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ వీడియో రిలీజ్ చేసిన వికారాబాద్ బీఎస్పీ నేత సత్యమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారణాసిలోని ఓ హోటల్ లో సత్యమూర్తితో పాటు అతడి ఇద్దరు కూతుళ్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 నెలల కిందట సత్యమూర్తి భార్య సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ కేసులో పోలీసులు సరైన విచారణ జరపటం లేదని సత్యమూర్తి ఆరోపించాడు. తన భార్య ఆచూకీ కనిపెట్టాలని సత్యమూర్తి  ఓ ఎమోషన్ వీడియో రిలీజ్ చేశాడు. 48 గంటల్లో ఆచూకీ కనిపెట్టకపోతే తన ఇద్దరి కూతుళ్లతో కలిసి సూసైడ్ చేసుకుంటానని డెడ్ లైన్ పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది. 

దీంతో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి సత్యమూర్తి  కనిపించకుండా వెళ్లిపోయాడు. సత్యమూర్తి కోసం విచారణ ప్రారంభించిన పోలీసులు... అతడు శంషాబాద్ మీదుగా ముంబై, అక్కడి నుంచి వారణాసి వెళ్లినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో ఓ హోటల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే సత్యమూర్తి, ఆయన ఇద్దరి కూతుళ్లను తాండూరుకు తీసుకొస్తామని పోలీసులు తెలిపారు.