వికారాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (VUDA )ని ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.VUDA ఏర్పాటు కోసం జీవో : 190 ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం సిఎం రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా VUDA పని చేస్తుందని...జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిల్లో సరైన రవాణా సౌకర్యాలు,ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణాలకు VUDA కృషి చేస్తుందని తెలిపారు. పరిగి, తాండూరు, వికారాబాద్, కోడంగల్ మున్సిపాలిటీ లతో పాటు 493 గ్రామాలు VUDA పరిధిలోకి వస్తాయన్నారు.
VUDA ఏర్పాటు వల్ల జిల్లా కు తాగు నీటి ఎద్దడి తీరిపోతుందని అన్నారు. జిల్లాలో కొత్త పరిశ్రమలు నిర్మించి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాని తెలిపారు. 3వేల 100 కోట్ల రూపాయలతో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో దేశవ్యాప్తంగా వికారాబాద్ జిల్లాకు మంచి పేరు వచ్చిందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గుర్తుచేశారు.
Also Read :- 10 రోజులుగా తెరుచుకోని కేఫ్ బహార్.. కారణం ఇదే..
VUDA ఏర్పాటు వల్ల జిల్లా అభివృద్ధి లో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిల్లో సరైన రవాణా సౌకర్యాలు,ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణాలకు VUDA కృషి చేస్తుంది. రుణమాఫీపై బీఆర్ఎస్ నాయకులు కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని...బ్యాంకు అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల కొంత మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు.రాబోయే రోజుల్లో వారి ఋణాలన్ని మాఫీ అవుతాయని తెలిపారు.