వికారాబాద్, వెలుగు : వికారాబాద్‌జిల్లా దోమ పీఎస్పరిధిలో పోక్సో కేసు నమోదులో అలసత్వం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారిపై ఇంటర్నల్ఎంక్వైరీ నిర్వహించనున్నట్టు ఎస్పీ స్నేహా మెహ్రా వెల్లడించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ విచారణలో తప్పు చేసినట్టు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. అలాగే, మైనర్‌బాలికలపై లైంగికదాడి జరిగిందని, వీడియోలు తీశారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
బాధిత బాలిక ఒక్కరే అని ఆమె స్టేట్మెంట్ప్రకారం ఓ మైనర్‌బాలుడు ఈవ్‌టీజింగ్ తో పాటు అసభ్యకర కామెంట్స్‌తో వేధించాడని తేలిందన్నారు. అతడిపై పోక్సో కేసు పెట్టి జువైనల్‌హోమ్‌కు పంపించినట్టు చెప్పారు. ఇద్దరూ మైనర్లే కావడంతో విషయాలు బయటకు వెల్లడించడం లేదన్నారు.
