కమల్ హాసన్ విక్రమ్ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌

కమల్ హాసన్  విక్రమ్ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌

చాలా రోజుల తర్వాత పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో అలరించడానికి సిద్ధమైన విశ్వ నటుడు కమల్ హాసన్ తాజాగా నటించిన విక్రమ్ చిత్రం కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా జూన్ 3న ఈ మూవీ విడుదల కానున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించగా.. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్ తో పాటు, పాటలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. 

ఇదిలా ఉండగా.. విక్రమ్ తెలుగు సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో శ్రేష్ఠ్ మూవీస్ జోరుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 400కి పైగా థియేటర్లలో ఆడనున్నట్టు మూవీ టీం ప్రకటించారు. ఇక ఇటీవలే రిలీజ్ అయిన విక్రమ్ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకొని, ఇప్పటికే ఉన్న  అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

 

మరిన్ని వార్తల కోసం...

రూ.12లక్షలు పెట్టి మరీ కుక్కలా మారాడు

కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో విజయ్ దేవరకొండ