'పొన్నియిన్ సెల్వన్' నుండి విక్రమ్ వైల్డ్ లుక్

'పొన్నియిన్ సెల్వన్' నుండి విక్రమ్ వైల్డ్ లుక్

 లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్గా 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా వస్తోంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాది సెప్టెంబర్ 30న తమిళ, తెలుగు, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. భారీ క్రేజీ తారాగణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇది. ఈ మూవీలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్, సారా అర్జున్, త్రిష, రెహమాన్, జయరామ్, శోభితా ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు తదితరులు నటిస్తున్నారు. 

 విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో రెండు నెలల ముందుగానే చిత్ర బృందం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా 'పొన్నియిన్ సెల్వన్'లో నటించిన ముఖ్యమైన పాత్రలని రివీల్ చేస్తున్నారు. తాజాగా సోమవారం ఈ సినిమాలోని హీరో విక్రమ్ పాత్రకు సంబంధించిన లుక్ రిలజ్ చేశారు. ఇందులో విక్రమ్ 'ఆదిత్య కరికాలన్' గా నటిస్తున్నారు. చోళ సామ్రాజ్యంలో వైల్డ్ టైగర్ గా విక్రమ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్రమ్ దే కీలక పాత్ర అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.