చంద్రయాన్ 3 : సెప్టెంబర్ 22న విక్రమ్ ల్యాండర్ మళ్లీ నిద్రలేస్తుందా.. ఏం జరగబోతుంది..?

చంద్రయాన్ 3 : సెప్టెంబర్ 22న విక్రమ్ ల్యాండర్ మళ్లీ నిద్రలేస్తుందా.. ఏం జరగబోతుంది..?

జాబిల్లి దక్షిణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ లు రెండు వారాల పాటు విజయవంతంగా పని చేశాయి.   రెండు రోజుల క్రితమే రోవర్‌ స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లగా.. తాజాగా ల్యాండర్‌ కూడా అందుకు సిద్ధమైంది. 

సెప్టెంబర్ 4 న ల్యాండర్‌ విక్రమ్‌ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లిందని ఇస్రో ప్రకటించింది. ఇండియా టైమింగ్స్ ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో విక్రమ్‌ ల్యాండర్‌ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లింది. 

అంతకుముందు జరిపిన ప్రయోగం తర్వాత.. కొత్త ప్రదేశంలోనూ అందులోని రాంభా, చాస్టే, ఐఎల్‌ఎస్‌ఏ పేలోడ్‌లు పనిచేశాయి. వాటి సమాచారం భూమికి చేరింది. పేలోడ్‌లన్నీ  స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయి. 

ల్యాండర్‌ రిసీవర్లు మాత్రం ఆన్‌లోనే ఉన్నాయి.సోలార్ ఎనర్జీ తగ్గి బ్యాటరీ ఖాళీ అయిన తర్వాత ప్రజ్ఞాన్‌ పక్కనే విక్రమ్‌ కూడా స్లీపింగ్ స్టేజీలోకి వెళ్లిపోతుంది. సెప్టెంబర్‌ 22న మళ్లీ తిరిగి అవి మేలుకుంటాయని ఆశిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. 

సోలార్‌ ప్యానెల్‌ల ద్వారా శక్తి పొందే విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ 14 రోజులే పని చేశాయి. సూర్యరశ్మి ఉన్నంత వరకే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా శాస్త్రవేత్తలు వీటిని రూపొందించారు. 

సూర్యాస్తమయ  సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంలో టెంపరేచర్స్ మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ల్యాండర్‌, రోవర్‌ వ్యవస్థలు మనుగడ సాగించడం కష్టమవుతుంది. 

14 రోజుల తర్వాతే మళ్లీ అక్కడ సూర్యోదయం అవుతుంది. ఆ సమయంలో ల్యాండర్‌, రోవర్‌లపై సన్ రేస్ పడి పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

అందుకే  అనుగుణంగా దాన్ని మార్చారు. సెప్టెంబర్‌ 22న వచ్చే సూర్యోదయంతో అవి పనిచేస్తే మరిన్ని విషయాలు సర్చ్ చేయవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు.  లేదా అవి మూన్ పై పర్మనెంట్ గా ఉండిపోనున్నాయి.