చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండర్ కూడా పడుకుంది..14 రోజుల తర్వాత పని చేస్తాయో లేదో.. !

చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండర్ కూడా పడుకుంది..14 రోజుల తర్వాత పని చేస్తాయో లేదో.. !

నిన్నటి నిన్న చంద్రయాన్ 3లోని ప్రజ్ణా రోవర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయింది. చంద్రుడిపై 14 రోజులు ఎండ..14 రోజులు చీకటి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రజ్ణా రోవర్ పని చేయటానికి అవసరం అయిన సోలార్ పవర్ లేకపోవటంతో.. అది నిద్రలోకి వెళ్లినట్లు ప్రకటించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇప్పుడు అదే తరహాలో.. విక్రమ్ ల్యాండర్ సైతం స్లీప్ మోడ్ లోకి వెళ్లింది. విక్రమ్ ల్యాండర్ కూడా పడుకుంటుంది.. విశ్రమించే ముందు విక్రమ్ ల్యాండర్ తీసిన ఫొటోలు ఇవే అంటూ ఇస్రో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇస్రో ఎక్స్ మెసేజ్ ఏంటో ఓసారి చూద్దాం...

విక్రమ్ ల్యాండర్ స్లీప్ మోడ్ లోకి సెట్ చేశాం.. దీనికంటే ముందే ChaSTE, RAMBHA-LP, ILSA పేలోడ్‌ లు సేకరించిన డేటాను ఇస్రో స్వీకరించింది. పేలోడ్ లు ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి.. సోలార్ పవర్ తగ్గి బ్యాటరీ అయిపోయిన తర్వాత విక్రమ్ కూడా ప్రజ్ఞాన్ పక్కనే నిద్రపోతాడు.  2023 సెప్టెంబర్ 22, నాటికి తిరిగి ఇవి రీషెడ్యూల్ అవుతాయని ఆశిస్తున్నామని’’ ఇస్రో ట్వీట్ చేసింది.