
చియాన్ విక్రమ్ మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వస్తున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో ఈ హీరో ‘తంగలాన్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్ బర్త్‌డే సందర్భంగా మూవీ టీం అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.
ఇందులో విక్రమ్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. 19వ శతాబ్దంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో విక్రమ్ మరోసారి ప్రయోగం చేశాడు. పూర్తిగా డీగ్లామరైజ్డ్గా కనిపించి షాకిస్తున్నాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో చివర్లో వచ్చే సీన్ హైలెట్ గా నిలిచింది. విజువల్స్, జీవీ ప్రకాశ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్, పార్వతి నటిస్తున్నారు.