
వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోల్లో కమల్ హాసన్ తర్వాత చియాన్ విక్రమ్ పేరు గుర్తుకు వస్తుంది. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటారు. ఆయన ఎంచుకునే సినిమాలతో పాటు.. అందుకు తగ్గట్లు తన లుక్స్‌ను మార్చుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా విక్రమ్ రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో తన లుక్ కోసమే ఎక్కువ కసరత్తు చేస్తుంటాడు. తన పాత్రకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు.
ప్రస్తుతం విక్రమ్ పా. రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ అనే సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ పాత్ర కోసం ఆయన మేకప్ వేసుకునేందుకే.. సుమారు 4 గంటల సమయం కేటాయించారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను విక్రమ్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. దానికి బ్యాక్ టూ ది ఫ్యూచర్ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇందులో విక్రమ్ లుక్ చాలా వైడ్ గా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.