మన విక్రమ్​ను ఫొటో తీసిన నాసా ఆర్బిటర్

మన విక్రమ్​ను ఫొటో తీసిన నాసా ఆర్బిటర్

చంద్రుడిపై దిగిన మన ల్యాండర్ విక్రమ్.. నాసా ఆర్బిటర్ కెమెరాకు చిక్కింది. విక్రమ్​ అక్కడ దిగిన నాలుగు రోజులకే (ఆగస్టు 27న) లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (ఎల్​ఆర్​వో) గుర్తించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దాదాపు 600 కి.మీ. దూరంలో విక్రమ్​ను, ఉపరితలంపై కదులుతున్న ప్రజ్ఞాన్ రోవర్​ను ఫొటోలు తీసింది. తాజాగా ఈ ఫొటోలను నాసా విడుదల చేసింది.