విక్రమాదిత్యపై తేజస్.. యుద్ధనౌకపై సక్సెస్​ఫుల్​గా దిగిన ఫైటర్ జెట్​

విక్రమాదిత్యపై తేజస్.. యుద్ధనౌకపై సక్సెస్​ఫుల్​గా దిగిన ఫైటర్ జెట్​

మన యుద్ధనౌక విక్రమాదిత్యపై తొలిసారిగా మనం సొంతంగా తయారు చేసుకున్న ఫైటర్ జెట్ తేజస్​ విజయవంతంగా ల్యాండ్ అయింది. శనివారం అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై దిగి,  ఆ ఫీట్​ సాధించిన తొలి స్వదేశీ ఫైటర్ జెట్​గా నిలిచింది.  తేలికపాటి యుద్ధ విమానం (ఎల్ సీఏ) అయిన తేజస్–ఎన్ ప్రొటోటైప్ విమానాన్ని నేవీ కోసం తయారు చేశారు. ఇప్పటివరకు గోవా సమీపంలోని టెస్టింగ్ ఫెసిలిటీలో మాత్రమే దీనిని పరీక్షించారు. ఇక్కడి టెస్టింగ్ డెక్​కు, ఐఎన్ఎస్ విక్రమాదిత్య డెక్​పై ల్యాండింగ్​కు చాలా తేడా ఉన్నప్పటికీ, తేజస్ సక్సెస్ ఫుల్​గా దిగడం విశేషం. గంటకు 244 కిలోమీటర్ల వేగంతో వచ్చిన తేజస్–ఎన్ ఫైటర్ జెట్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై 87 మీటర్ల దూరం వెళ్లి నిలిచిపోయిందని నేవీ అధికారులు వెల్లడించారు. దీన్నే అరెస్టెడ్​ ల్యాండింగ్​ అంటారు. అంటే యుద్ధనౌకపై ఉండే ఓ తీగను ఫైటర్ జెట్ వెనక ఉండే హుక్స్​తో పట్టుకుని, లాక్కుంటూ వెళ్తూ, వేగాన్ని తగ్గించుకుంటూ ఫైటర్ జెట్లను ఆపే పద్ధతి. అలాగే, యుద్ధనౌకపై ఒకవైపు ఎత్తుగా ఉండే భాగం గుండా ‘స్కైజంప్’ పద్ధతిలో టేకాఫ్ ​టెస్టులోనూ తేజస్–ఎన్ పాస్ కావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి